రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధికారుల వివరాల ప్రకారం, వర్షం ఎప్పుడైనా ఒక్కసారిగా ప్రారంభమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని, రహదారులపై జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో వాహనదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.