10 ఏళ్ల తర్వాత టీచర్స్ డే వేడుకలకు సీఎం హాజరు

టీచర్స్ డే అనగానే ఉపాధ్యాయుల హర్షం, ఆనందం అలరారుతాయి. ఈ ప్రత్యేక దినోత్సవంలో అవార్డులు అందుకునే గురువుల ఆనందమే వేరు. అభినందనలు వెల్లువెత్తే ఈ వేదికకు ముఖ్యమంత్రి హాజరవుతే, ఆ ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుంది. గతంలో 2014లో రవీంద్రభారతి వేదికగా జరిగిన టీచర్స్ డే వేడుకలకు అప్పటి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. దాదాపు దశాబ్దం తర్వాత, ఈసారి సెప్టెంబర్ 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. మాదాపూర్ శిల్పకళావేదికలో ఈ వేడుక ఘనంగా జరగనుంది.

Read More